న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు రావడం లేదు.. 'క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక' నిరసనను గౌరవించిన స‌న్నీలియోన్‌ !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు రావడం లేదు.. 'క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక' నిరసనను గౌరవించిన స‌న్నీలియోన్‌ !

  • సన్నీలియోన్‌ డ్యాన్స్‌తో వేడుక నిర్వ‌హించేందుకు బెంగ‌ళూరులో ఏర్పాట్లు
  • క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక అభ్యంత‌రాలు
  •  మీ నిర్ణ‌యాల‌ను నేను గౌరవిస్తాను
  • మీతోనే నవభారతం- స‌న్నీలియోన్‌
నూత‌న సంవ‌త్స‌ర ఆగమనం సందర్భంగా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం కోసం నిర్వాహ‌కులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 31న బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్‌ డ్యాన్స్‌తో వేడుక నిర్వ‌హించేందుకు బెంగ‌ళూరులో ఏర్పాట్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, దీనిపట్ల క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. దీంతో చివ‌ర‌కు తాను బెంగళూరులో జరగనున్న కొత్త సంవ‌త్స‌ర‌ వేడుకలకు హాజరుకావడం లేదని సన్నీలియోన్‌ ప్రకటించింది.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో 'మీరంతా యువకులు.. మీకు సొంత అభిప్రాయాలతో పాటు సొంతంగా తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. వాటిని నేను గౌరవిస్తాను.. మీతోనే నవభారతం' అని స‌న్నీలియోన్‌ పేర్కొంది. దీంతో స‌న్నీలియోన్ వ‌స్తుంద‌ని ఎంతో హుషారుగా ఎదురు చూసిన యువ‌త ఆశ‌ల‌పై నీళ్లు పోసిన‌ట్ల‌యింది.  
new year
Sunny Leone
tweet

More Telugu News