వెంక‌న్న స‌న్నిధిలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంక‌న్న స‌న్నిధిలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు!

  • స్వామివారి సేవ‌లో పాల్గొన్న దంప‌తులు
  • స్వాగ‌తం ప‌లికిన దేవాదాయ అధికారులు
  • వారిని చూసేందుకు ఎగబడిన అభిమానులు
సినీన‌టుడు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డికి విచ్చేసిన రామ్ చర‌ణ్ దంపతుల‌కు ఆల‌య అధికారులు సాద‌ర‌స్వాగ‌తం ప‌లికారు. సోమవారం ఉదయం జ‌రిగిన‌ వీఐపీ ప్రారంభ దర్శనంలో ఈ జంట పాల్గొని, స్వామివారికి సేవ చేశారు. వీరితో పాటు చిరంజీవి కుమార్తె శ్రీజ భ‌ర్త క‌ల్యాణ్ కూడా తిరుమ‌ల‌కు వ‌చ్చారు. ద‌ర్శ‌నం త‌ర్వాత వారు బ‌య‌టికి రాగానే త‌మ అభిమాన హీరోను చూడ‌టానికి అభిమానులు పోటీప‌డ్డారు. 'జూనియ‌ర్ మెగాస్టార్‌' అని అరుస్తూ రామ్‌చ‌ర‌ణ్‌తో మాట్లాడానికి ప్ర‌యత్నించారు. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.
Ramcharan
upasana
Tirumala
Tirupati

More Telugu News