అదే మాటను నా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా?: శ్రీకాంత్ రెడ్డి
- తనతో సంప్రదించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా
- పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు
పాదయాత్రలో జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని... ఈ నేపథ్యంలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి రోజు 14 నుంచి 16 కిలోమీటర్లు నడుస్తూ ప్రజల కష్టసుఖాలను జగన్ తెలుసుకుంటున్నారని చెప్పారు. వైసీపీ నుంచి పలువురు బయటకు వస్తున్నారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.