వికెట్ల వెన‌క్కి వెళ్లి వెరైటీగా ఔటైన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వికెట్ల వెన‌క్కి వెళ్లి వెరైటీగా ఔటైన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌!

  • బంతి కొట్టే ప్ర‌య‌త్నంలో ఆట నియ‌మాలు మ‌రిచాడు
  • వైర‌ల్‌గా మారిన చ‌మ‌ర సిల్వా వీడియో
  • ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్న నెటిజ‌న్లు
శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చమర సిల్వా ఔటైన  విధానం చూస్తే 'ఇలాక్కూడా ఔట‌వ్వ‌చ్చా?' అనే సందేహం క‌లుగుతుంది. అత‌ను వెరైటీగా ఔటైన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కొలంబోలో ఎమ్‌ఏఎస్‌ హోల్డింగ్స్ పేరుతో జ‌రిగిన ఓ టోర్నీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందులో యునిచెల జ‌ట్టుకు చ‌మ‌ర సిల్వా కెప్టెన్‌గా ఉన్నాడు.

టీజే లంక జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో భాగంగా మధుశంక వేసిన 20వ ఓవర్‌లో సిల్వా వెరైటీగా ఔటయ్యాడు. బంతిని ఎదుర్కునే ప్ర‌య‌త్నంలో ఒక సెక‌నుపాటు ఆట నియ‌మాలు మ‌ర్చిపోయాడు. బాల్‌ని ఎదుర్కునే ప్ర‌య‌త్నంలో సిల్వా వికెట్ల వెనుకకు పరిగెత్తాడు. అప్పుడు మధుశంక వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి వికెట్లను తాకింది. దీంతో సిల్వా ఔట‌య్యాడు.

అయితే ఈ వీడియోకు నెటిజ‌న్లు చేసిన ఫ‌న్నీ కామెంట్లు చాలా న‌వ్వు తెప్పిస్తున్నాయి. సిల్వా కావాల‌నే ఔట‌య్యాడ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సిల్వా భార్య అత‌న్ని త్వ‌ర‌గా ఇంటికి ర‌మ్మంది... అందుకే ఇలా ఔట‌య్యాడని వారు కామెంట్లు చేశారు.
srilanka
chamara silva
batman
lbw
out
over
ball
cricket

More Telugu News