మెహ్రీన్ అదృష్టం మాములుగా లేదు .. మరో భారీ సినిమాకి గ్రీన్ సిగ్నల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెహ్రీన్ అదృష్టం మాములుగా లేదు .. మరో భారీ సినిమాకి గ్రీన్ సిగ్నల్

  • యూత్ లో మెహ్రీన్ కి పెరిగిపోతోన్న క్రేజ్ 
  • వచ్చేనెల 1న 'జవాన్' విడుదల
  • తాజాగా గోపీచంద్ సరసన ఛాన్స్ 
  • దర్శకుడిగా చక్రి పరిచయం  
మెహ్రీన్ ఇప్పుడు కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. సినిమా .. సినిమాకి ఆమె క్రేజ్ పెరిగిపోతూ వుంది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' .. 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' తో ఆమె హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా 'కేరాఫ్ సూర్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, వచ్చేనెల 1వ తేదీన 'జవాన్' సినిమాతో పలకరించనుంది.

 గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరిని సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. గోపీచంద్ హీరోగా దర్శకుడు చక్రి ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, చివరికి మెహ్రీన్ ను ఖరారు చేశారట. ఈ విషయంతో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు. 
gopichand
mehreen

More Telugu News