ఆర్టిస్ట్ ను కావాలని గౌతమ్ మీనన్ ను కలిస్తే, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరమన్నారు : హీరో సందీప్ కిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టిస్ట్ ను కావాలని గౌతమ్ మీనన్ ను కలిస్తే, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరమన్నారు : హీరో సందీప్ కిషన్

  • ఆర్టిస్ట్ కావాలనే కోరిక బలంగా ఉండేది 
  • గౌతమ్ మీనన్ దగ్గర పనిచేయడం హెల్ప్ అయింది 
  • అసిస్టెంట్ డైరెక్టర్ నంటూ అందరినీ కలిసేవాడిని 
  • ఆర్టిస్టుగా చేయాలనుందని అడిగేవాడిని  
తెలుగు .. తమిళ భాషల్లో మంచి దూకుడు మీదున్న యువ కథానాయకులలో సందీప్ కిషన్ పేరు కూడా కనిపిస్తుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కేరాఫ్ సూర్య' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించాడు.

 " మొదటి నుంచి కూడా నాకు ఆర్టిస్ట్ కావాలని ఉండేది .. దాంతో ఓ రోజున దర్శకుడు గౌతమ్ మీనన్ గారిని కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన తమిళ .. తెలుగు భాషల్లో ఒక సినిమా చేస్తున్నారు. ముందుగా తన టీమ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరమనీ, తెలుగు వెర్షన్ లో నన్ను ఒక హీరోగా పెడతానని అన్నారు.

అయితే, త్రిష ప్రధానమైన పాత్రగా షూటింగ్ నడిచిన ఆ సినిమా ఆగిపోయింది. అయినా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన దగ్గర నేను కంటిన్యూ అయ్యాను. ఆయన దగ్గర పనిచేస్తుండటమనేది మిగతా వాళ్లను తేలికగా కలవడానికి నాకు ఉపయోగపడింది. అలా అసిస్టెంట్ డైరెక్టర్ నంటూ దర్శక నిర్మాతలను కలిసి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టమనే విషయాన్ని చెబుతూ ఉండేవాడిని" అని అన్నాడు.    
sundeep kishan
gautham menon

More Telugu News