మూడు రోజుల్లో 'గరుడ వేగ' రాబట్టిన వసూళ్లు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రోజుల్లో 'గరుడ వేగ' రాబట్టిన వసూళ్లు ఇవే!

  • రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గరుడ వేగ'
  • పెరిగిన థియేటర్ల సంఖ్య 
  • పుంజుకున్న వసూళ్లు 
  • అదే ఈ సినిమాకి కలిసొచ్చింది
చాలా గ్యాప్ తరువాత రాజా శేఖర్ 'గరుడవేగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చేంతవరకూ ఎలాంటి అంచనాలు లేవు. కానీ ట్రైలర్ బయటికి వచ్చిన తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యాడు.

తొలి రోజున ఓపెనింగ్స్ భారీస్థాయిలో లేకపోయినా, ఆ తరువాత వసూళ్లు పుంజుకున్నాయి .. థియేటర్స్ సంఖ్య పెంచవలసి వచ్చింది. మౌత్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. తొలి మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.35 కోట్ల షేర్ ను .. 4.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 3.25 కోట్ల షేర్ ను .. 6.65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'గరుడ వేగ'కి ముందు వచ్చిన సినిమాలు .. తరువాత వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు.          
rajasekhar
pooja kumar

More Telugu News