మద్యం విక్రయాలు బాగా జరగాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలి: బీజేపీ మంత్రి గిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మద్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఓవైపు మహిళల ఆందోళన
- మరోవైపు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు
- పొగాకు ఉత్పత్తులకు బాగా గిరాకీ రావడానికి కారణం వాటికి మహిళల పేర్లు పెట్టడమే
చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారని, పొగాకు ఉత్పత్తులు అంతగా అమ్ముడు పోవడానికి వాటికి మహిళల పేర్లు పెట్టడమే కారణమని మంత్రి గిరీష్ అన్నారు. కనుక మద్యం షాపులకు ‘మహారాజా’కి బదులు ‘మహారాణి’ అని పేరు మార్చాలని చెప్పారు.