'ఆదివారానికి టికెట్లు బుక్ చేసుకున్నా'నని రాజమౌళి అంటే... 'ధన్యవాదాలు సర్' అన్న రాజశేఖర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆదివారానికి టికెట్లు బుక్ చేసుకున్నా'నని రాజమౌళి అంటే... 'ధన్యవాదాలు సర్' అన్న రాజశేఖర్!

  • హిట్ టాక్ సొంతం చేసుకున్న రాజశేఖర్ ‘పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18 ఎమ్‌’ సినిమా
  • సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పిన రాజమౌళి
  • ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసిన రాజశేఖర్
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ‘పి.ఎస్‌.వి. గరుడవేగ 126.18 ఎమ్‌’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకు దర్శకుడిగా ప్రవీణ్‌ సత్తారు వ్యవహరించాడు. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి తోడు, సుదీర్ఘ విరామం తరువాత రాజశేఖర్ ఫాంలోకి వచ్చాడని, కథాకథనాలకు తోడు రాజశేఖర్ నటన హైలైట్ అని చూసిన వారు చెబుతున్న నేపథ్యంలో స్పందించిన రాజమౌళి ట్వీట్ చేశారు.

 ఈ సినిమాకు ఆదివారం షోకి టికెట్లు బుక్ చేసుకున్నానని పేర్కొన్నారు. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందని అభినందించారు. దానికి రాజశేఖర్ స్పందించారు. ‘ధన్యవాదాలు సర్‌. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఈ సినిమాలో రాజశేఖర్ తో పాటు పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్ణమురళి నటించారు. సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ అదనపు హంగు. 
rajamouli
rajasekhar
psv garudavega
garudavega movie

More Telugu News