చాలా బాధగా ఉందంటోన్న శ్వేత బసు ప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా బాధగా ఉందంటోన్న శ్వేత బసు ప్రసాద్

  • ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్‌
  • వ్యభిచారం ఆరోపణలతో గతంల్ రెస్క్యూహోంలో కౌన్సిలింగ్
  • హిందీ సిరీయల్ లో నటిస్తున్న శ్వేత బసు ప్రసాద్
ఆమధ్య వ్యభిచారం కేసులో రెస్క్యూ హోంలో కౌన్సిలింగ్ తీసుకున్న సినీ నటి శ్వేత బసు ప్రసాద్.. తాజాగా తన సీరియల్ అయిపోవడంతో బాధగా ఉందని తన ఇన్ స్టా గ్రాంలో పేర్కొంది. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్‌ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోలేకపోయింది. పోలీస్ కేస్ అనంతరం సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో హిందీలో ‘చంద్ర నందిని’ అనే టీవీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్‌ షూటింగ్ నిన్నటితో ముగిసిపోవడంతో తన ఇన్ స్టా గ్రాంలో భావోద్వేగంతో నిండిన పోస్ట్‌ పెట్టింది.

 అందులో ఏమందంటే...‘ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది. అలాగే ‘చంద్ర నందిని’ కూడా ముగిసింది. ఎంత బాధగా ఉందో చెప్పడానికి మాటలు రావడంలేదు. ఈ సీరియల్‌ లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్‌ కి ధన్యవాదాలు. నా తోటి నటీనటులకు, ప్రొడక్షన్‌ బృందానికి కూడా ధన్యవాదాలు. రేపటి నుంచి చిత్రీకరణ కోసం స్టూడియోకి వెళ్లే పనిలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది. నన్ను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ సీరియల్ లో నటించిన ఫోటోను పోస్టు చేసింది. 
swetha basu prasad
instagram
serial

More Telugu News