'క్వీన్' రీమేక్ విషయంలో నేను అనుకున్నదే జరిగింది : డైరెక్టర్ నీలకంఠ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'క్వీన్' రీమేక్ విషయంలో నేను అనుకున్నదే జరిగింది : డైరెక్టర్ నీలకంఠ

  • హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'క్వీన్' 
  • తెలుగు రీమేక్ లో తమన్నా
  • దర్శకుడిగా నీలకంఠ  
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు నీలకంఠ సిద్ధహస్తుడు. షో .. మిస్సమ్మ .. విరోధి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రస్తుతం ఆయన హిందీ 'క్వీన్' మూవీకి తెలుగు రీమేక్ చేసే పనుల్లో వున్నాడు. ఒరిజినల్ కథను యధాతథంగా తెరకెక్కిస్తారా? ఏమైనా చేంజెస్ చేస్తారా? అనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

" హిందీ 'క్వీన్' వెరీ బ్యూటిఫుల్ మూవీ .. గ్రేట్ స్క్రిప్ట్" అని ఆయన అన్నారు. "తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కోసం అక్కడక్కడా చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేస్తాను"అని చెప్పారు. "నిజానికి నాకు రీమేక్ లు చేయడం నచ్చదు. కానీ హిందీ 'క్వీన్' చూసినప్పుడు మాత్రం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనిపించింది" అన్నారు. "ఇక ఈ ప్రాజెక్టు అటు తిరిగి .. ఇటు తిరిగి తన దగ్గరికే రావడం కో ఇన్సిడెంట్" అని చెప్పుకొచ్చారు.         
tamannah

More Telugu News