దర్శకుడిగా మారుతోన్న కెమెరామెన్ .. హీరోగా నాగశౌర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడిగా మారుతోన్న కెమెరామెన్ .. హీరోగా నాగశౌర్య

  • మెగాఫోన్ పడుతోన్న కెమెరామెన్ 
  • హీరోగా నాగశౌర్య 
  • సంగీత దర్శకుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ 'రధన్'
  • త్వరలోనే సెట్స్ పైకి          
గతంలో కెమెరామెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది .. ఆ తరువాత మెగాఫోన్ చేతబట్టారు. అలాంటివాళ్లలో చాలామంది సక్సెస్ ఫుల్ చిత్రాలను అందిస్తూ వెళుతున్నారు. తాజాగా అదే బాటలో అడుగులు వేయడానికి కెమెరామెన్ సాయిశ్రీరామ్ కూడా రెడీ అవుతున్నారు.

 పిల్లజమీందార్ .. గీతాంజలి .. ఎక్కడికిపోతావు చిన్నవాడా .. సుప్రీమ్ వంటి పలు హిట్ చిత్రాలకి కెమెరామెన్ గా ఆయన పనిచేశారు. ఇక దర్శకుడిగా తన సత్తా చాటడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోగా ఆయన నాగశౌర్యను ఎంచుకున్నారు. ' అందాల రాక్షసి' .. 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలకి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్న 'రధన్' .. ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.          
nagashourya

More Telugu News