నిన్ను రేప్ చేస్తానని జర్నలిస్టును బెదిరించిన ఎడిటర్ ఇన్ చీఫ్.. సోషల్ మీడియాలో దుమారం!
- హార్వే వెయిన్ స్టీన్ లైంగిక వేధింపులతో పెరిగిన చైతన్యం
- ఫ్రాన్స్ లో మొదలైన బాలన్సెటన్ పోర్క్ యాష్ ట్యాగ్ ఉద్యమం
- లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెడుతున్న నెటిజన్లు
ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టిన ఫోయిస్ లాగే రేడియో జర్నలిస్టు సాండ్రా ముల్లర్ తానెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ, ఒకరోజు తమ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ 'నీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం చేస్తా'నని బెదిరించాడని ట్విట్టర్ లో తెలిపింది. దీంతో ట్విట్టర్ లో పెను దుమారం రేగింది. అప్పటి నుంచి తమపై జరిగిన లైంగిక వేధింపుల పర్వాన్ని వెల్లడిస్తూ వేలాదిమంది మహిళలు స్పందిస్తున్నారు. మరికొందరు అప్పట్లో ఈ వేధింపులను బయటపెట్టలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.