నాగార్జున వల్లనే నేను ఆ రోజు బతికి బయటపడ్డాను: నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగార్జున వల్లనే నేను ఆ రోజు బతికి బయటపడ్డాను: నటి సుధ

  • కేరక్టర్ ఆర్టిస్టుగా సుధకి మంచి గుర్తింపు 
  • ఆ రోజును మరిచిపోలేను 
  • నిర్లక్ష్యం చేయడం వల్లనే అలా జరిగింది  
తెలుగు తెరపై అక్క .. వదిన .. అమ్మ పాత్రలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నవారిలో సుధ ఒకరు. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. తన జీవితంలో మరిచిపోలేని ఓ సంఘటన గురించి ఆమె ప్రస్తావించారు. 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' సినిమా షూటింగ్ సమయంలో తనకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని ఆమె అన్నారు.

అయితే రెండు రోజుల నుంచీ బాగా నొప్పి వున్నా తాను నిర్లక్ష్యం చేశానని చెప్పారు. మూడో రోజున మేకప్ చేసుకుని సెట్ కి వెళ్లాననీ, సెట్లో అడుగుపెడుతూనే కుప్పకూలి పోయానని అన్నారు. ఆ సమయంలో నాగార్జున గారు అక్కడే ఉన్నారనీ, వెంటనే ఆయన 'అపోలో' హాస్పిటల్లో చేర్పించారని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయించడం వలన తాను బతికి బయటపడ్డానని అన్నారు. ఈ రోజున తాను ఇంకా మిగిలి ఉండటానికి కారణం నాగార్జున అని చెప్పుకొచ్చారు.    
sudha

More Telugu News