కోహ్లీ మాత్రమే కాదు...ధోనీ కూడా తొలిసారే!
- టీ20ల్లో తొలిసారి డక్కౌట్ అయిన కోహ్లీ
- టీ20ల్లో తొలిసారి స్టంప్ అవుట్ అయిన ధోనీ
- జంపా తెలివిగా వేసిన బంతిని ఆడడంలో తడబడిన ధోనీ
ఆడమ్ జంపా వేసిన పదవ ఓవర్ ఐదో బంతిని ఆడేందుకు ధోనీ బాగా ముందుకు వచ్చాడు. అయితే ధోనీని బాగా గమనించిన జంపా.. పిచ్ సగంలో బంతి టర్న్ అయ్యేలా చేశాడు. అప్పటికే ముందుకు వచ్చిన ధోనీ, అది మరింత ముందుగా పిచ్ పై పడడంతో లిప్తపాటులో ఆలోచించాడు. అంతలో ఆ బంతి ధోనీని దాటుకుని కీపర్ చేతిలో పడింది. దీంతో అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ధోనీ టీ20ల్లో తొలిసారి స్టంప్ అవుట్ అయ్యాడు.