వ‌ర‌ద బాధితుల‌కు పేప‌ర్ ట‌వ‌ల్స్ విసిరేసిన ట్రంప్‌... విరుచుకుప‌డిన నెటిజ‌న్లు!
Add ap7am to your home Screen

వ‌ర‌ద బాధితుల‌కు పేప‌ర్ ట‌వ‌ల్స్ విసిరేసిన ట్రంప్‌... విరుచుకుప‌డిన నెటిజ‌న్లు!

  • ఇదేమీ టీవీ షో కాదంటూ స‌ల‌హా
  • `సంతాపం తెలియ‌జేయ‌డం రాని ప్రెసిడెంట్` అంటూ కామెంట్లు
  • తీవ్ర అసంతృప్తికి లోనైన ప్యూర్టో రికో బాధితులు
ప్ర‌కృతి వైప‌రీత్యాలు, కాల్పుల ఘ‌ట‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అమెరిక‌న్ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న వైఖ‌రిపై నెటిజ‌న్లు మండిపడుతున్నారు. లాస్ వెగాస్ కాల్పుల ఘ‌ట‌న‌కు సంతాపం తెలియ‌జేస్తూ ఆయ‌న చేసిన ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది. అందులో ఆయ‌న వాడిన ప‌దాలు సంతాపాన్ని కాకుండా, ఆనందాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా ఉండ‌టంతో నెటిజ‌న్లు మండిప‌డ్డారు.

ఆ త‌ర్వాత ప్యూర్టో రికోలో హ‌రికేన్ మ‌రియా బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ట్రంప్ వెళ్లారు. అక్క‌డ బాధితుల‌కు పేప‌ర్ ట‌వ‌ల్స్‌ను ట్రంప్ విస‌ర‌డాన్ని నెటిజ‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు. ఏదో టీవీ షోలో అవార్డులు ఇస్తున్న‌ట్లు పేప‌ర్ ట‌వ‌ల్స్‌ను పంచ‌డం స‌బ‌బు కాద‌ని చెబుతున్నారు. ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌కి క‌ష్ట‌కాలంలో ఉన్న‌ త‌న ప్ర‌జ‌ల‌కు క‌నీసం సంతాపం తెలియ‌జేయ‌డం కూడా రాద‌ని కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ వైఖ‌రి ప‌ట్ల తీవ్ర అసంతృప్తికి లోన‌యిన‌ట్లు ప్యూర్టో రికో బాధితులు చెప్పారు.
donald trump
paper towels
america president
twitterati
puerto rico
hurricane maria

More Telugu News