కండలు పెంచేస్తోన్న మెగా హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కండలు పెంచేస్తోన్న మెగా హీరో!

  •  కండలు పెంచడంపై యంగ్ హీరోల ఆసక్తి
  •  అదే బాటలో వరుణ్ తేజ్ కూడా
  •  మాస్ ఆడియన్స్ లో క్రేజ్ కోసమేనంటూ టాక్  
టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోల మాదిరిగా కండలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా నిఖిల్ కూడా కండలు పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ తేజ్ కూడా కండలు పెంచే పనిలోనే వున్నాడు. ఆల్రెడీ చాలావరకూ సక్సెస్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశాడు కూడా.

 వరుణ్ తేజ్ మంచి పొడగరి కావడం వలన, కండలు పెంచితే స్క్రీన్ పై మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తాడనడంలో సందేహం లేదు. అయితే ఆయన హ్యాండ్సమ్ లుక్ కోసం కండలు పెంచుతున్నాడా? లేదంటే ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం కాకుండా, ఆ తరువాత చేసే ప్రాజెక్టు కోసం పెంచుతున్నాడా? అనేది తెలియాల్సి వుంది. ఇప్పటి వరకూ క్లాస్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకున్న వరుణ్ తేజ్, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కోసమే ఇలా ట్రై చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.   
varun tej

More Telugu News