అమెరికన్ విద్యార్థులపై ఫ్రాన్స్‌లో యాసిడ్ దాడి.. పోలీసుల అదుపులో నిందితురాలు
బాటిల్‌లోని యాసిడ్‌ను వారిపై కుమ్మరించడంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే యాసిడ్ వారి ముఖంపై పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత ఉగ్రదాడిగా అనుమానించిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. అయితే మహిళకు మతిస్థిమితం లేదని తర్వాత గుర్తించారు. చికిత్స అనంతరం బాధితులను ఆదివారం డిశ్చార్జ్ చేశారు.