లావణ్య త్రిపాఠి తప్పుకోవడానికి దర్శకుడితో విభేదాలే కారణమా?
పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం వల్లనే లావణ్య త్రిపాఠిని తప్పించేశారనే టాక్ వచ్చింది. అయితే, అసలు కారణం అది కాదనీ .. దర్శకుడు పరశురామ్ తో ఏర్పడిన విభేదాల కారణంగానే లావణ్య త్రిపాఠి పక్కకి తప్పుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి 'శ్రీరస్తు శుభమస్తు' చేసింది. అలాంటిది హఠాత్తుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది.