'గౌతమ్ నంద' ఇంతలో అంత రాబట్టేశాడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గౌతమ్ నంద' ఇంతలో అంత రాబట్టేశాడా?

మాస్ ఆడియన్స్ లో గోపీచంద్ కి మంచి క్రేజ్ వుంది. కంటెంట్ వుండాలే గానీ .. భారీ వసూళ్లను తెచ్చే హీరోనే ఆయన. అలాంటి గోపీచంద్ .. సంపత్ నంది దర్శకత్వంలో 'గౌతమ్ నంద' సినిమా చేశాడు. సంపత్ నందికి కూడా మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. ఈ విషయాన్ని ఆయన గత చిత్రాలు నిరూపించాయి కూడా. కానీ 'గౌతమ్ నంద' విషయంలో ఎక్కడో తేడా కొట్టేసింది. దాంతో ఆశించిన స్థాయిలో గోపీచంద్ కి సరైన హిట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి వారంలో 25 కోట్లను వసూలు చేసిందనీ, ఇవి గోపీచంద్ కెరియర్లోనే చెప్పుకోదగిన వసూళ్లని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తొలివారంలో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిందా? అనే ఆశ్చర్యాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం మూడు సినిమాలు థియేటర్స్ కి వచ్చాయి కనుక, వసూళ్ల ప్రభావం 'గౌతమ్ నంద' పై మరింతపడే అవకాశం వుంది.  
gopichand
hansika

More Telugu News