'గౌతమ్ నంద'కు అలాంటిలాంటి హిట్ సరిపోదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గౌతమ్ నంద'కు అలాంటిలాంటి హిట్ సరిపోదట!

యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన హీరోల్లో గోపీచంద్ ఒకరు. ఎందుకో తెలియదు గానీ .. కొంతకాలంగా ఆయన ఎంచుకున్న కథలు ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ కావడం లేదు. దాంతో ఆయన త్వరలో రానున్న 'గౌతమ్ నంద' సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు సంపత్ నంది కూడా ఈ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు.

 చరణ్ తో 'రచ్చ' .. రవితేజతో 'బెంగాల్ టైగర్' చేసి మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో సంపత్ నంది సక్సెస్ అయ్యాడు. అలాంటి సంపత్ నంది .. గోపీచంద్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో 'గౌతమ్ నంద' తెరకెక్కించాడు. ఈ సినిమా లాభాలను తీసుకురావాలంటే అలాంటిలాంటి హిట్ సరిపోదని అంటున్నారు. ఒక రేంజ్ లో హిట్ కొట్టకపోతే కష్టమేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి హిట్ ను గోపీచంద్ - సంపత్ నంది అందుకుంటారేమో చూడాలి.
gopichand
hansika

More Telugu News