రెయిన్ సాంగ్ సూపర్బ్ అంటోన్న కేథరిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెయిన్ సాంగ్ సూపర్బ్ అంటోన్న కేథరిన్!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా 'గౌతమ్ నంద' సినిమా రూపొందింది. హన్సిక - కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో తన పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పింది.

దర్శకుడు సంపత్ నంది రెయిన్ సాంగ్స్ ను అద్భుతంగా చిత్రీకరిస్తాడనీ .. ఆ సాంగ్స్ తనకి ఎంతో ఇష్టమని అంది. అలాంటి రెయిన్ సాంగ్ ఈ సినిమాలో ఉందనీ .. అది సూపర్బ్ గా వచ్చిందని చెప్పింది. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంది. ఇక తాను సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా చేస్తున్నానంటూ వచ్చిన కామెంట్స్ పైనా ఆమె స్పందించింది. పాత్రకి ప్రాధాన్యత .. నటనకి స్కోప్ వుంటే తాను ఓకే చెప్పేస్తాననీ, అంతేగానీ ఫస్టు హీరోయిన్ నా? .. సెకండ్ హీరోయిన్నా? అనే విషయాన్ని గురించి ఆలోచించనని స్పష్టం చేసింది.     
gopichand
cetherine

More Telugu News