త్రిష అసలు పెటా సభ్యురాలే కాదు: జల్లికట్టుపై పోరాటం నేపథ్యంలో త్రిష తల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష అసలు పెటా సభ్యురాలే కాదు: జల్లికట్టుపై పోరాటం నేపథ్యంలో త్రిష తల్లి

జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాడులో ఆందోళ‌న‌లు మిన్నంటుతున్న వేళ ప్ర‌ముఖ సినీన‌టులు జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్దతు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ట్విట్ట‌ర్‌లో జ‌ల్లిక‌ట్టుకి వ్య‌తిరేకంగా పోస్ట్ చేసిన త్రిష కూడా తాను జల్లికట్టుకు వ్యతిరేకం కాదని, తమిళ ప్రజల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ‌ని కూడా ఈరోజు ప్ర‌క‌టించారు. త‌న కూతురి ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేసి అందులో జ‌ల్లిక‌ట్టుకి వ్య‌తిరేకంగా పోస్టులు చేశార‌ని ఇటీవ‌లే త్రిష‌ తల్లి ఉమా కృష్ణన్ చెన్నయ్‌ పోలీసు కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు ఆమె త‌న ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ అంశంపై మ‌రోసారి స్పందించారు. త్రిష అసలు పెటా సభ్యురాలే కాదని ఆమె పేర్కొన్నారు. ప్రజలంతా అపార్థం చేసుకున్నారని చెప్పారు.
jallikattu
trisha

More Telugu News