మెరీనాబీచ్‌ నుంచి వీడియో పోస్ట్ చేసిన ప్రభుదేవా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెరీనాబీచ్‌ నుంచి వీడియో పోస్ట్ చేసిన ప్రభుదేవా!

జ‌ల్లిక‌ట్టు క్రీడను నిర్వహించడానికి అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ చెన్న‌య్‌లోని మెరీనా బీచ్ వ‌ద్ద త‌మిళులు పెద్ద‌ ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. మెరీనా బీచ్ వ‌ద్ద‌కు చేరుకుంటున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నిర‌స‌న‌కు దిగిన ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా కూడా అక్క‌డ‌కు చేరుకుని అక్క‌డి ప‌రిస్థితిని వీడియో తీశారు. అనంత‌రం ట్విట్టర్‌లో పోస్టు చేసి... వేల సంఖ్యలో జనం బీచ్‌ వద్దకు చేరి ఆందోళనలో పాల్గొంటున్నార‌ని అన్నారు. ఆ క్రీడ‌పై ఉన్న‌ నిషేధాన్ని ఎత్తివేయమని కోరుతూ వేల మంది విద్యార్థులతో చెన్నై మెరీనాబీచ్‌ వద్ద శాంతియుత‌ మార్గంలో, రాజకీయాలకు అతీతంగా నిర‌స‌న చేపట్టామని పేర్కొన్నారు. జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నట్లుగా తన ప్రొఫైల్ పిక్ ని కూడా మార్చేశారు.

jallikattu

More Telugu News