సిక్కిం.. ఈశాన్య భారతదేశంలోని ఓ చిన్న హిల్ స్టేట్. ఇప్పుడీ రాష్ట్రం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. ఆ తర్వాత స్థానంలో కేరళ నిలిచింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) గతేడాది నిర్వహించిన స్వచ్ఛత సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. మొత్తం 26 రాష్ట్రాల్లో 2015 మే-జూన్ మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 3,788 గ్రామాల్లో 73,176 గృహాలను అధ్యయనం చేశారు. స్వచ్ఛ్ సుర్వేక్షన్-గ్రామీణ్ 2016 పేరుతో నివేదికను విడుదల చేశారు.
మిజోరం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హర్యాణా రాష్ట్రాలు పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో చోటుదక్కించుకోగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు అంతగా పరిశుభ్రతపై దృష్టి సారించడం లేదని తేలింది. సిక్కిం రికార్డు స్థాయిలో వందశాతం మంది టాయిలెట్లను వినియోగిస్తున్నారు. వీరిలో 98.2 శాతం గృహాలకు టాయిలెట్ సౌకర్యం ఉండడం గమనార్హం. ఈ విషయంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి. చత్తీస్‌గఢ్‌లోని 21.2 శాతం గృహాల్లో టాయిలెట్లు ఉండగా, జార్ఖండ్‌లో మరింత అధ్వానంగా 18.8 శాతం టాయిలెట్లు మాత్రమే కలిగి ఉండి అట్టడుగు స్థానంలో నిలిచింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ 12వ స్థానంలో నిలవగా 47.4 శాతం టాయిలెట్లతో జమ్ముకశ్మీర్ 17 స్థానంలో నిలిచింది.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్