వరకట్నం డిమాండులపై యువతులు యుద్ధం ప్రకటిస్తున్నారు. అత్తింటి వారి ఆలోచనలను పసిగట్టి ముందుగానే మేల్కొంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని ఫెయితపుర గ్రామానికి చెందిన భారతీ యాదవ్ కు, బరన్ ప్రాంతానికి చెందిన శంభు దయాల్ తో ఈ నెల 15న నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా శంభుకు ద్విచక్రవాహనం, కొన్ని తులాల బంగారం కానుకగా ఇచ్చారు. అయితే ఆ తరవాత వారికి ఆశపెరిగింది. వివాహం సందర్భంగా కారు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి భారతి తల్లిదండ్రులు అది తమవల్ల కాదన్నారు.
దీంతో కారు ఇస్తేనే నిర్ణయించిన ప్రకారం ఈ నెల 22న వివాహం జరుగుతుందని, లేని పక్షంలో జరగదని వరుడి తరఫు వారు తేల్చి చెప్పారు. నిశ్చితార్థం జరగడంతో చేసేది లేక, భారతి తల్లిదండ్రులు ఆరు నెలల్లో కారు ఇస్తామని చెప్పారు. దీంతో అందుకు తగ్గా మొత్తానికి ప్రామిసరీ నోటు రాయించి తీసుకున్నారు. ఈ తతంగమంతా చూసిన భారతి ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. శంభుతో నిర్ణయించిన వివాహాన్ని రద్దు చేసుకుని, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్