అతి తక్కువ కాలంలో సొమ్మును రెట్టింపు చేసి ఇస్తామని లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారం ఇంకా తేలనే లేదు. అప్పుడే ఏపీలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని దినసరి కూలీలే లక్ష్యంగా మరో సంస్థ నయా మోసానికి పాల్పడింది. ఏపీ సరిహద్దు కర్ణాటక పట్టణం కోలార్ కేంద్రంగా ‘సెవెన్ హిల్స్ ఇండియి ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట 2011లో రంగప్రవేశం చేసిన ఓ సంస్థ ఇప్పటిదాకా దాదాపు రూ.5 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది.
కేవలం కంప్యూటర్ స్లిప్పులనే బాండ్లుగా జారీ చేసిన ఆ సంస్థ సదరు స్లిప్పుల మీద ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాల సిబ్బందితోనే సంతకాలు చేయించింది. ఏజంట్లకు ఆకర్షణీయ కమీషన్లను ముట్టజెప్పిన ఆ సంస్థ టార్గెట్ చేసిన అన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో డిపాజిట్లు సేకరించింది. ఈ సంస్థ తొలుత జారీ చేసిన బాండ్ల కాల పరిమితి 2017తో ముగియనుంది. సేకరించిన డిపాజిట్లలో సింగిల్ డిపాజిట్ కు కూడా తిరిగి చెల్లింపులు చేయకుండానే సెవెన్ హిల్స్ బోర్డు తిప్పేసింది.
అనంతపురం జిల్లాలోని కదిరిలోని ఆ సంస్థ ప్రాంతీయ కార్యాలయం రెండు నెలలుగా మూసే ఉంది. అనుమానం వచ్చిన డిపాజిటర్లు ఆరా తీయగా, సిబ్బంది సరిగా స్పందించలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కదిరి కార్యాలయ మేనేజర్ వీరన్నతో పాటు నాగార్జున, బాబ్ జాన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్