శివసేన నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావోతే నిజంగా ఆదర్శనీయుడే. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో తనయుడు వాదనకు దిగాడన్న విషయం తెలుసుకున్న ఆయన నిబంధనలు అందరికీ వర్తిస్తాయని తన చర్య ద్వారా చాటిచెప్పారు. జరిమానా కట్టాలంటూ తనయుడికి స్పష్టం చేశారు. వివరాల్లోకెళితే... దివాకర్ రావోతే తనయుడు ఉన్మేశ్ ను డ్రంకన్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు నిలువరించారు. అతడిని ప్రశ్నించగా, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారితో వాదనకు దిగాడు.
మరుసటి రోజు ఉదయం ఈ విషయం మంత్రి రావోతేకు తెలిసింది. వెంటనే ఆయన తన కుమారుడిని మందలించి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు రూ.1000 ఫైన్ కట్టాలంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..."పోలీసులు వారి విధి వారు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తుంటారు, కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తుంటారు. నేను మంత్రినైనా గానీ, ఇలాంటి విషయాల్లో నా కుమారుడికీ మినహాయింపు ఇచ్చేదిలేదని నిరూపించాను" అని పేర్కొన్నారు. రావోతే ఇంతకుముందోసారి, హెల్మెట్ లేకుండా బైక్ పై వెళుతున్న ఓ కానిస్టేబుల్ కు జరిమానా విధించి వార్తల్లోకెక్కారు.
More Telugu News
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!