ఐఎస్ఐఎస్ మిలిటెంట్ సంస్థ పాపాల చిట్టాలో మరొకటి చేరింది. క్రొయేషియాకు చెందిన వ్యక్తిని పీక కోసి చంపిన ఐఎస్ ఆ వీడియోను, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తొమిస్లావ్ సాలోపెక్ అనే ఈ క్రొయేషియా దేశస్తుడిని కిందటి నెలలో ఈజిప్టు రాజధాని కైరో పశ్చిమ ప్రాంతంలో అపహరించారు. ఈజిప్టు జైళ్లలో ఉన్న ముస్లిం మహిళా ఖైదీలను విడుదల చేయకుంటే అతడిని చంపేస్తామని 48 గంటల డెడ్ లైన్ విధించారు. అది గత శుక్రవారంతో ముగిసింది. తూర్పు సినాయ్ ద్వీపకల్పంలో అతడిని చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ఐఎస్ చేతిలో ప్రాణాలు విడిచిన సాలోపెక్ వివాహితుడు, ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. ఫ్రెంచ్ జియోసైన్స్ సంస్థ సీజీజీలో పనిచేస్తున్నాడు.