డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి పోరుబందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా రావడాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు. ఆ మత్స్యకార బోటును వెంటనే ఆపాల్సిందిగా బోటులోని వారికి కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. హెచ్చరికలు వినపడుతున్నా బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. బోటు స్పీడు పెంచారు, అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో హెచ్చరికగా కోస్ట్ గార్డ్ సిబ్బంది బోటుపై కాల్పులు జరిపారు.
దీంతో బోటు మరింత వేగం అందుకుంది. దీంతో అప్రమత్తమైన కోస్టు గార్డు సిబ్బంది, పాక్ బోటును దాదాపు గంట సేపు వెంబడించారు. బోటుకు అత్యంత సమీపంలోకి వెళ్లి చూసిన కోస్ట్ గార్డు సిబ్బందికి, బోటు సిబ్బంది మొత్తం డెక్ కింద భాగంలో దాక్కుని ఉండడం గమనించారు. దీంతో తక్షణం వారు లొంగిపోవాలని హెచ్చరించారు. దీంతో భారత్ కోస్ట్ గార్డు తమను ప్రాణాలతో పట్టుకునే ప్రమాదముందని భావించిన తీవ్రవాదులు పేల్చేసుకున్నారు.
దీంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. పేలుడు నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు జరిపాయి. కాగా సదరు బొటు కరాచీ సమీపంలోని కేతిబందర్ నుంచి బయల్దేరినట్లు గుర్తించారు. ఈ ఘటనతో నిఘా వర్గాలతో పాటు, అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
More Telugu News
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్