ఏపీ లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి సిట్ కస్టడీ
- సునీల్ కుమార్ను రెండు రోజుల పాటు విచారించనున్న అధికారులు
- ఐదు రోజుల కస్టడీకి సిట్ అభ్యర్థన.. రెండు రోజులకు కోర్టు అనుమతి
- మరో నిందితుడు ఈశ్వర్ కుమార్ రెడ్డి రిమాండ్ అక్టోబర్ 27 వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను రెండు రోజుల పాటు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్లలో జరిగిన అవకతవకలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సునీల్ కుమార్ను మరింత లోతుగా విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు రోజులకు (బుధ, గురువారాలు) కస్టడీకి అనుమతినిచ్చింది.
ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న టి. ఈశ్వర్ కుమార్ రెడ్డి రిమాండ్ను కూడా ఇదే కోర్టు అక్టోబర్ 27 వరకు పొడిగించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఈశ్వర్ రెడ్డి రిమాండ్ గడువు నిన్నటితో ముగియడంతో... జైలు అధికారులు అతడిని వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆయన రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.