భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర సాహస పురస్కారం
- స్మిత్ కోలుకున్నాక పురస్కారం అందిస్తానన్న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్
- సహ పైలట్ దాడిని ఎదుర్కొని 174 మంది ప్రాణాలను కాపాడిన మచ్చర్
- గాయపడినా కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులకు సహకరించిన పైలట్
- దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్న ప్రయాణికులు
- ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకూ సాహస పురస్కారాలు
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ విమానంలో సహ పైలట్ దాడి చేసినా వెనక్కి తగ్గలేదు.. తీవ్రంగా గాయపడినా ధైర్యంగా పోరాడి 174 మంది ప్రాణాలను కాపాడారు. ఆయన సాహసానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అరుదైన గౌరవం ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర సాహస పురస్కారాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వెల్లడించారు. మచ్చర్ కోలుకున్న తర్వాత స్వయంగా పురస్కారాన్ని అందజేస్తానని తెలిపారు.
గతవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యూఏఈ దర్యాప్తు వివరాల ప్రకారం.. విమాన సహ పైలట్ హమామ్ అల్ హమామీ కాక్‌పిట్‌లోని గొడ్డలితో మచ్చర్‌పై దాడి చేశాడు. అనంతరం విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా యూఏఈ అధికారులు అభివర్ణించారు.
తనపై దాడి జరిగినా మచ్చర్ ప్రతిఘటించారు. గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో లోపలికి వచ్చిన ప్రయాణికులు దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి సాహసంతో విమానం ప్రమాదానికి గురికాకుండా నిలువరించగలిగారు.
ఈ ఘటనలో ధైర్యంగా వ్యవహరించిన ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకు సైతం హెర్జోగ్ పౌర సాహస పురస్కారాలను అందించారు. తాలి మేనెస్, జ్వికా మేనెస్, యానివ్ హయూన్, డాక్టర్ షోటా ముసాయేవ్, అసఫ్ రజువాన్, ఓర్ పార్డిలోవ్‌లను జెరూసలేంలోని అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు.
ఇదిలా ఉండగా.. విమానంలో జరిగిన భయానక ఘటనను మచ్చర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. ఇజ్రాయెల్ తదుపరి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేడుక జ్యోతిని వెలిగించాల్సిందిగా మచ్చర్‌ను నెతన్యాహు ఆహ్వానించారు.