దామా శేషాద్రి నాయుడు మనవడి ఉయ్యాల వేడుక.. హాజరైన మంత్రి లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దామా శేషాద్రి నాయుడు మనవడి ఉయ్యాల వేడుక.. హాజరైన మంత్రి లోకేశ్

Dama Seshadri Naidu grandson cradle ceremony attended by Minister Nara Lokesh
  • హైకోర్టు మాజీ న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడు మనవడి ఉయ్యాల వేడుక
  • చిన్నారిని ఆశీర్వదించిన లోకేశ్
  • కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ, మాజీ మంత్రి దగ్గుబాటి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు ఇంట జరిగిన వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఆయన మనవడి ఉయ్యాల వేడుక కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారిని ఆశీర్వదించి, దామా శేషాద్రి నాయుడు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఒకే వేదికపై పలువురు రాజకీయ ప్రముఖులు కనిపించడంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి లోకేశ్, ఇతర నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. వ్యక్తిగత వేడుక అయినప్పటికీ, ప్రముఖుల రాకతో రాజకీయ వర్గాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
Advertisement
Dama Seshadri Naidu
Nara Lokesh
Raghu Rama Krishna Raju
Daggubati Venkateswara Rao
Cradle Ceremony
Andhra Pradesh Politics

More Telugu News