భారత్‌లో ఐఫోన్‌ తయారీ పెరుగుతున్నా.. అమెరికా కంటే ఇక్కడే ఎందుకింత ఖరీదు?

భారత్‌లో ఐఫోన్‌ తయారీ పెరుగుతున్నా.. అమెరికా కంటే ఇక్కడే ఎందుకింత ఖరీదు?

iPhone manufacturing increases in India but why is it still more expensive than USA
  • ఐఫోన్‌ 18 ప్రో భారత్‌లో రూ.1,64,900 నుంచి ప్రారంభం
  • ప్రో మ్యాక్స్‌ భారత్‌లో రూ.1,79,900 నుంచి అందుబాటులోకి
  • అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధర చాలా ఎక్కువ 
  • అమెరికా ధరలకు స్థానిక సేల్స్‌ ట్యాక్స్‌ అదనం
  • భారత్‌లో ప్రకటించే ధరలో 18 శాతం జీఎస్టీ
ఐఫోన్‌ కొనేందుకు భారత్‌లో వినియోగదారులు భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందే. తాజాగా విడుదలైన ఐఫోన్‌ 18 ప్రో ధర భారత్‌లో రూ.1,64,900గా ఉంది. ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,79,900 నుంచి మొదలవుతోంది. మరోవైపు అమెరికాలో ఇవే మోడళ్ల ప్రారంభ ధరలు భారత ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది.. భారత్‌లోనే ఐఫోన్‌ తయారీ పెరుగుతున్నప్పుడు ఇక్కడ ధర ఎందుకు తగ్గడం లేదు? 

భారత్‌ ఖరీదైన మార్కెట్లలో ఒకటి
ఐఫోన్‌ 18 ప్రో 256జీబీ మోడల్‌ భారత్‌లో రూ.1,64,900. అమెరికా ధరను భారత కరెన్సీలోకి మార్చితే సుమారు రూ.1.05-1.10 లక్షల స్థాయిలో ఉంటుంది. జర్మనీలో సుమారు రూ.1.61 లక్షలు, బ్రిటన్‌లో రూ.1.54 లక్షలు, చైనాలో రూ.1.42 లక్షలు, జపాన్‌లో రూ.1.37 లక్షలు, యూఏఈలో రూ.1.32 లక్షల వరకు ఉంటుంది. అంటే అమెరికాతో పోలిస్తే భారత్‌లో అదే ఫోన్‌ కోసం దాదాపు రూ.55 వేల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

ప్రో మ్యాక్స్‌ ధరలోనూ భారీ తేడా
ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ 256జీబీ ధర భారత్‌లో రూ.1,79,900. అమెరికా ధరను భారత కరెన్సీలోకి మార్చితే అది సుమారు రూ.1.14 లక్షల పరిధిలో ఉంటుంది. జర్మనీలో సుమారు రూ.1.77 లక్షలు, బ్రిటన్‌లో రూ.1.67 లక్షలు, చైనాలో రూ.1.56 లక్షలు, జపాన్‌లో రూ.1.49 లక్షలు, యూఏఈలో రూ.1.42 లక్షల స్థాయిలో ఉంటుంది. అంటే ప్రో మ్యాక్స్‌ విషయంలోనూ భారత్‌ చౌకైన మార్కెట్‌ కాదు. 

ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డ్యుయోలో మరింత షాక్‌
యాపిల్‌ తొలిసారి తీసుకొచ్చిన ఫోల్డబుల్‌ ఐఫోన్‌ డ్యుయో ధర భారత్‌లో రూ.2,99,900 నుంచి మొదలవుతోంది. అమెరికాలో దీని ప్రారంభ ధరను భారత కరెన్సీలోకి మార్చితే సుమారు రూ.1.80-1.90 లక్షల స్థాయిలో ఉంటుంది. జర్మనీ, బ్రిటన్‌ వంటి మార్కెట్లలో ఇది సుమారు రూ.2.5 లక్షల పరిధిలో ఉంది. అంటే కొత్త ఫోల్డబుల్‌ ఐఫోన్‌ విషయంలో కూడా భారత్‌లో చెల్లించాల్సిన మొత్తం భారీగానే ఉంది. 

అసలు తేడా ఎక్కడ వస్తోంది?
ఇక్కడ ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం అమెరికా ధరను నేరుగా భారత్‌ ధరతో పోల్చడం పూర్తిగా సరైన పద్ధతి కాదు. అమెరికాలో యాపిల్‌ ప్రకటించే ధరకు రాష్ట్రాన్ని బట్టి స్థానిక సేల్స్‌ ట్యాక్స్‌ అదనంగా ఉంటుంది. భారత్‌లో యాపిల్‌ ప్రకటించే ధరలో 18 శాతం జీఎస్టీ కలిపి ఉంటుంది. అయినప్పటికీ పన్నుల తేడాను తీసేసి చూసినా భారత్‌ ధర అమెరికాతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుందని మార్కెట్‌ విశ్లేషణలు చెబుతున్నాయి. మిగతా దేశాల్లోనూ అక్కడి స్థానిక పన్నుల ఆధారంగా ధరలు ఉంటాయి. అలాగే మార్కెట్‌ను బట్టి యాపిల్‌ కూడా తమ ధరల వ్యూహాలను మారుస్తూ ఉంటుంది.

భారత్‌లో తయారీ పెరిగినా..
ఇక్కడ మరో అపోహను తొలగించాలి. “భారత్‌లో తయారవుతోంది” అంటే ఐఫోన్‌లోని ప్రతి భాగం భారత్‌లో తయారవుతోందని కాదు. యాపిల్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరాదారుల నుంచి కీలక భాగాలను తీసుకుంటుంది. చిప్స్, మెమరీ, డిస్‌ప్లే, కెమెరా భాగాలు వంటి ఖరీదైన కాంపొనెంట్లలో చాలా వరకు అంతర్జాతీయ సరఫరా గొలుసుపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

అందుకే భారత్‌లో అసెంబ్లీ జరిగినా మొత్తం ఫోన్‌ తయారీ ఖర్చు ఒక్కసారిగా భారీగా తగ్గిపోదు. పైగా ఈసారి ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాల్లో ఒకటి.
Advertisement
iPhone
Apple iPhone 18 Pro India price
iPhone manufacturing India
iPhone 18 Pro Max cost
Apple Foldable iPhone Duo
iPhone price difference India USA

More Telugu News