టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. వైరల్ అవుతున్న ఫొటోలు!
- ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విందుకు హాజరైన విజయ్, రష్మిక
- విందు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ
- సొంత గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్ దేవరకొండ
మరోవైపు విజయ్ దేవరకొండ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం తుమ్మనపేటలో 'ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్' తరఫున విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా హాజరుకావడం విశేషం. వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన 181 మంది విద్యార్థులకు వారు చెక్కులను అందజేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన వారికి రూ. 10,000, సెకండ్ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఒకవైపు రాజకీయ ప్రముఖులతో విందు, మరోవైపు సొంత ఊరిలో సేవా కార్యక్రమం.. ఇలా రెండు భిన్నమైన సందర్భాల్లోనూ విజయ్, రష్మిక జంటగా కనిపించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.