తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నిక.. సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష
- తమిళనాడులో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
- జూన్ 18న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి
- సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
- సీటును టీవీకే నిలబెట్టుకుంటుందా? లేక మిత్రపక్షాలకు కేటాయిస్తుందా? అనే దానిపై చర్చ
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వానికి తొలి రాజకీయ పరీక్ష ఎదురుకానుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి రాజ్యసభ ఎన్నిక కావడంతో దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి సీవీ షణ్ముగం ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ కాగా, జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఇచ్చారు. జూన్ 18న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం 233 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే ఒక అభ్యర్థికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఏ ఒక్క పార్టీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేనందున, అధికార కూటమి బలాబలాలపైనే ఫలితం ఆధారపడి ఉంది. ప్రస్తుతం సంఖ్యాపరంగా టీవీకే నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. దీంతో ఈ సీటును వారే గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సీఎం విజయ్ ముందు కీలక సవాల్
అయితే, ఈ కీలకమైన రాజ్యసభ స్థానాన్ని టీవీకే పార్టీయే నిలబెట్టుకుంటుందా? లేక ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిచ్చిన కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలకు కేటాయిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి టీవీకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా? లేదా కూటమి ధర్మాన్ని పాటిస్తుందా? అనేది త్వరలో తేలనుంది. నామినేషన్ల ప్రక్రియ దగ్గర పడుతుండటంతో అభ్యర్థి ఎంపికపై చర్చలు వేగవంతం కానున్నాయి. ఈ నిర్ణయం సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలకు అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.