సూర్య ‘కరుప్పు’కు ఊహించని బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా, షోలు రద్దు

Suriya Karuppu Release Postponed Due to Unexpected Break Shows Cancelled
  • ఆర్థిక సమస్యల కారణంగానే షోలు ఆగిపోయినట్లు సమాచారం
  • భారత్, ఓవర్సీస్‌లోనూ రద్దయిన ప్రదర్శనలు
  • అడ్వాన్స్ టికెట్ల డబ్బులు రీఫండ్ చేస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు
  • తప్పనిసరి పరిస్థితుల వల్లేనని ప్రకటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' చిత్రానికి విడుదల రోజున ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం, మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం ప్రదర్శితం కావాల్సిన ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

ఆర్థికపరమైన సమస్యల కారణంగానే ఈ సినిమా విడుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సినిమాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదని సమాచారం. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామంతో భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలను రద్దు చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు షోలను తొలగించి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

"తప్పనిసరి పరిస్థితుల కారణంగా 'కరుప్పు' ఉదయం 9 గంటల షోలను రద్దు చేస్తున్నాం. అందరికీ మా క్షమాపణలు" అని నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు, "నిర్మాతలు సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు" అని దర్శకుడు ఆర్‌జే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై గందరగోళం నెలకొంది.
Go Back to Shorts
Suriya
Karuppu
RJ Balaji
SR Prabhu
SR Prakash Babu
Kollywood
Tamil movie release
financial issues
movie delayed
premiere shows cancelled

More Telugu News