బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు

Krishank Granted Bail by Telangana High Court
  • కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇంటి వద్ద దాడి చేశారనే కేసు
  • 2024లో నమోదైన పాత కేసు
  • బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ కోర్టు

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో నమోదైన కేసుల్లో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 


కేసు వివరాల్లోకి వెళితే... కూకట్‌పల్లిలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేంద్ర కుమార్ నివాసం వద్ద గొడవ పడ్డారనే ఆరోపణలపై పోలీసులు క్రిశాంక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి అదనంగా, 2024లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక పాత కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి ఆయనను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడం, అధికారులను దూషించడం వంటి అంశాలపై ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్, వీటిపై బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో విచారణ సందర్భంగా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సెలవు రోజుల్లో కూడా పీటీ వారెంట్లు జారీ చేస్తూ తనను వేధిస్తున్నారని క్రిశాంక్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, నిబంధనల మేరకు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అంగన్‌వాడీలకు ఫోన్ల కొనుగోలులో జరిగిన అవకతవకలు, మంత్రులపై తాను చేసిన విమర్శల కారణంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని క్రిశాంక్ ఈ సందర్భంగా ఆరోపించారు.

Go Back to Shorts
Krishank
BRS Krishank
BRS Party
Telangana High Court
Bail Granted
Kukatpally
Congress Social Media Coordinator
Rajendra Kumar
Pet Basheerabad Police Station
Government Criticism

More Telugu News