చిరంజీవి 'విశ్వంభర'.. త్రిష బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్
- విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల
- పుట్టినరోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
- ఈ చిత్రంలో 'అవని' అనే పాత్రలో నటిస్తున్న త్రిష
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి మేకర్స్ సోమవారం ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె పోషిస్తున్న 'అవని' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకుంది. "అందమైన త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'అవని'గా ఆమె నటన ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉండబోతోంది" అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్‌లో త్రిష సంప్రదాయ దుస్తుల్లో చాలా హుందాగా కనిపిస్తున్నారు.
ఈ చిత్రం భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. సినిమా సెకండాఫ్ మొత్తం గ్రాఫిక్స్‌పైనే ఆధారపడి ఉంటుందని, అందుకే నిర్మాణానికి సమయం పడుతోందని గతంలో చిరంజీవి స్వయంగా తెలిపారు. ఇది పిల్లలను, పెద్దలలోని పసివారిని ఆకట్టుకునే చక్కటి చందమామ కథలా ఉంటుందని ఆయన వివరించారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.