'టీఆర్ఎస్' నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత

Kavitha tweet on Telangana Rakshana Sena
  • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు ఈసీ ఆమోదం
  • టీఆర్ఎస్‌కు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్న కవిత
  • తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ట్వీట్
'టీఆర్ఎస్ పార్టీ నాకు రాసి ఉందేమో' అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ 'టీఆర్ఎస్'‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర సేనకు బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖను అందజేశారు.

ఈ నేపథ్యంలో, 'టీఆర్ఎస్'కు ఆమోదం తెలపడంపై కవిత 'ఎక్స్' వేదికగా స్పందించారు. తొలుత తాను సూచించిన తెలంగాణ రాష్ట్ర సేనకు బదులు తెలంగాణ రక్షణ సేనకు ఈసీ ఆమోదం తెలిపింది. అయితే రెండింటి సంక్షిప్త నామాలు 'టీఆర్ఎస్' కావడంతో కవిత హర్షం వ్యక్తం చేశారు.

"తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్‌కు ఆమోదం లభించడం సంతోషంగా ఉంది. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను" అని కవిత పేర్కొన్నారు.

జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. 'టీఆర్ఎస్' నాకు రాసి పెట్టి ఉందేమో అని పేర్కొన్నారు.
Advertisement
Kavitha tweet on Telangana Rakshana Sena
Kavitha on Twitter
Kavitha on TRS

More Telugu News