హెచ్‌సీఏ అక్రమాలపై హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తునకు ఆదేశం

HCA Irregularities High Court Orders SIT Investigation
  • సీబీసీఐడీలోని సిట్‌తో విచారణ జరపాలని స్పష్టం
  • జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పాలన
  • అవినీతి జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్య
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో చోటుచేసుకున్న అవకతవకలపై తెలంగాణ హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇకపై హెచ్‌సీఏ కార్యకలాపాలను జస్టిస్ నవీన్‌రావు నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీఏకు స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన న్యాయవ్యవస్థ పరిధి నుంచి తప్పించుకోలేదని తేల్చి చెప్పారు. అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు పారదర్శకత కోసం కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.

దర్యాప్తునకు హెచ్‌సీఏ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో హైదరాబాద్ క్రికెట్ సంఘంలోని వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Go Back to Shorts
TG High Court
HCA
Hyderabad Cricket Association
Telangana High Court
SIT Investigation
Corruption
Justice Naveen Rao
Justice Nagesh Bhimapaka
Cricket Club
CBCID

More Telugu News