Uttar Pradesh: భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త

Uttar Pradesh Man Phool Bites Wifes Nose Off After Argument
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఆమె ముక్కు, చెంపలను కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో ఆమె ముక్కు భాగం తెగిపోగా, చెంపలపై లోతైన గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫూల్ అనే వ్యక్తికి పానాతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే, వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఘటన జరిగిన రోజు రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా, అది హింసకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన భర్త ఫూల్, భార్య ముఖంపై దాడి చేసి ముక్కు, చెంపలను బలంగా కొరికాడు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖంపై వైద్యులు దాదాపు పది కుట్లు వేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఝాన్సీలోని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయం కావడంతో ముఖ కవళికలను పునరుద్ధరించేందుకు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.

బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భర్త ఫూల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ దాడికి దారితీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.
Go Back to Shorts
Uttar Pradesh
Hamirpur
Phool
Domestic Violence
Wife Assault
Crime
Police Investigation
Facial Injuries
Plastic Surgery
Jhansi Medical College

More Telugu News