Chandrababu Naidu: హనుమత్ జయంతి: ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

Chandrababu Naidu and Nara Lokesh Wishes on Hanuman Jayanti
షార్ట్స్‌లో చూడండి
శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.

శ్రీరామ పరమభక్తుడైన హనుమంతుడు అపార బలానికి, జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీక అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. హనుమంతుడిని కొలవడం ద్వారా భయాలు తొలగి, ఆరోగ్యం, ధైర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు. ఆ స్వామి కృపతో ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన ట్వీట్ లో  హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక అని అన్నారు. హనుమాన్ జయంతి మనసుకు, శరీరానికి శక్తిని, నిబద్ధతను ఇచ్చే పర్వదినమని అభివర్ణించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప గుణానికి ఆంజనేయుడే నిదర్శనమని కొనియాడారు. ప్రజలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుని, పవనపుత్రుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని లోకేశ్ ఆకాంక్షించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Hanuman Jayanti
Nara Lokesh
TDP
Telugu States
Lord Hanuman
Hindu Festival
Anjaneya Swamy

More Telugu News