Chandrababu Naidu: కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు, ఘనసత్కారం... ఫొటోలు ఇవిగో!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేశ్ తమ నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిరంతరం సేవలందిస్తున్న సీనియర్లను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ విందుకు హాజరైన ప్రతి కార్యకర్త వద్దకు వెళ్లి వారి ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన పోరాటాలు, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారి సేవలను ఆయన కొనియాడారు.
తమను కుటుంబ సభ్యులుగా భావించి, స్వయంగా ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. అధినేత చూపిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, విందుకు హాజరైన కార్యకర్తలందరినీ చంద్రబాబు, లోకేశ్ కొత్త బట్టలు పెట్టి, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.