Bellamkonda Sreenivas: తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ హడావుడిలో ఉన్న నేటి కాలంలో, ఈ యువ హీరో మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం.
బెల్లంకొండ శ్రీనివాస్ తన మనసు గెలిచిన అమ్మాయి కావ్యను మనువాడబోతున్నారు. ఈ నెల మొదట్లో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆమెను పరిచయం చేసినప్పుడే అందరూ అది నిశ్చితార్థం అనుకున్నారు, కానీ అది కేవలం ఇరు కుటుంబాలు కలుసుకున్న సందర్భం మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు పెళ్లికి సంబంధించిన కీలక తేదీలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్యల నిశ్చితార్థం ఘనంగా జరగనుంది. ఏప్రిల్ 29న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమలలో వీరిద్దరి వివాహం చాలా సింపుల్‌గా, కేవలం సన్నిహితుల సమక్షంలో జరగబోతోంది. మే 1న హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.