Mohan Babu: 'ది ప్యారడైజ్' నుంచి మోహన్ బాబు బర్త్‌డే ట్రీట్.. నాని సినిమాలో క్రూరమైన పాత్రలో కలెక్షన్ కింగ్

Mohan Babu Birthday Treat from The Paradise Movie
షార్ట్స్‌లో చూడండి
లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి చిత్రయూనిట్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో మోహన్ బాబు అత్యంత శక్తిమంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ చిత్రంలో మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్, డార్క్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం విడుదల చేసిన వీడియోలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ తరం వారికి అసలు సిసలు మోహన్ బాబు అంటే తెలియదు. ‘ప్యారడైజ్’ సినిమాతో మోహన్ బాబు అంటే ఏంటో చూపిస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.



Go Back to Shorts
Mohan Babu
The Paradise movie
Nani
Srikanth Odela
Shikanja Malik
Anirudh Ravichander
Telugu cinema
Pan India movie
Sudhakar Cherukuri
SLV Cinemas

More Telugu News