Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'... జోరుగా నైజాం బుకింగ్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టయినర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు రంగం సిద్ధమైంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందే, ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో దేశవిదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
నైజాం (తెలంగాణ) వ్యాప్తంగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే, టికెట్ ధరలు పెంచకుండా సాధారణ రేట్లకే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.300గా ధరలు ఉన్నాయి. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 19న తెల్లవారుజామున ప్రదర్శించే బెనిఫిట్ షోలకు రూ.500 టికెట్ ధరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
విదేశాల్లోనూ 'ఉస్తాద్' హవా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 2.31 కోట్లకు పైగా వసూలయ్యాయి. దాదాపు రూ.127 కోట్ల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, మార్చి 18న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో సందడి మొదలుపెట్టనుంది.