Salman Khan: సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరు మారింది!

Salman Khans Battle of Galwan Movie Title Changed
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' టైటిల్‌ మారింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.

కొత్త టైటిల్‌తో పాటు "యుద్ధానికి శాంతి చేకూరాలి" (May War Rest in Peace) అనే బలమైన సందేశంతో కూడిన ఆకట్టుకునే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, మేకులు కొట్టిన కర్ర దుంగ వెనుక నుంచి సల్మాన్ ఖాన్ తీక్షణంగా చూస్తున్నట్టుగా కనిపించారు. ఈ కొత్త టైటిల్, దాని వెనుక ఉన్న సందేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యతను నిర్వర్తించిన 16వ బీహార్ రెజిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తుండగా, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిమేష్ రేషమియా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్‌లో సైనికుడి పాత్ర కోసం మీసంతో, రగ్డ్డ్ అవతార్‌లో సల్మాన్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Go Back to Shorts
Salman Khan
Battle of Galwan
Matrubhoomi May War Rest in Peace
Apoorva Lakhia
Galwan Valley clash
Colonel Santosh Babu
India China conflict
Bollywood movie
Chitrangada Singh
Himesh Reshammiya

More Telugu News