వంట విషయంలో అత్తతో గొడవ.. బెంగళూరులో మాజీ టెక్కీ బలవన్మరణం
- బెంగళూరులో కుటుంబ కలహాలతో టెకీ ఆత్మహత్య
- కట్నం కోసం వేధించారని మృతురాలి కుటుంబం ఆరోపణ
- భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, అత్త కోసం గాలింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు
మంగళవారం వంట చేసే విషయంలో సుష్మకు, ఆమె అత్త కల్పనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వంట చేయనివ్వకుండా అత్త తనను నిత్యం వేధింపులకు గురిచేసేదని సుష్మ తన కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు. భర్త పునీత్‌ను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న అత్త కల్పన కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.