50 లక్షలతో 120 కోట్లు తెచ్చిపెట్టిన సినిమా .. ఓటీటీలో!

Laalo Krishna Sada Sahayate Movie Update
  • ఓటీటీలో 'లాలో : కృష్ణ సదా సహాయతే' 
  • గుజరాతీలో తొలి 100 కోట్ల సినిమా
  • స్టార్స్ లేకుండా రికార్డు సృష్టించిన కంటెంట్  
  • 'సోనీలివ్' చేతికి స్ట్రీమింగ్ హక్కులు 
  • ఈ నెల 6 నుంచి మొదలు కానున్న స్ట్రీమింగ్

సాధారణంగా చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం .. భారీవసూళ్లను రాబట్టడం మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తమిళ .. కన్నడ సినిమాలు ఆ బాటలోనే ముందుకు వెళుతున్న తీరు కనిపిస్తుంది. రీసెంటుగా గుజరాతి సినిమా కూడా ఇలాంటి ఒక రికార్డును తొలిసారిగా తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా పేరే 'లాలో: కృష్ణ సదా సహాయతే'. ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల సినిమా ఇండస్ట్రీలన్నీ మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది.  

గుజరాతీలో రూపొందిన ఈ సినిమా, క్రితం ఏడాది అక్టోబర్ 10వ తేదీన అక్కడ విడుదలైంది. రీవా రిచ్ .. శ్రుహాద్ గోస్వామి .. కరణ్ జోషీ .. తదితరులు ఈ సినిమాలో నటించారు. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి స్మిత్ జె సంగీతాన్ని అందించాడు. గుజరాతీలో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కేవలం 50 లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 120 కోట్లను వసూలు చేయడం విశేషం. గుజరాతీ ఇండస్ట్రీలో తొలిసారిగా 100 కోట్లను రాబట్టిన సినిమా ఇది.

స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్స్ లేని సినిమా. గ్రాఫిక్స్ గారడీలు కనిపించని సినిమా. అలాంటి ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడం గురించి అంతా విశేషంగా చెప్పుకున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా 'సోనీలివ్' ప్రకటించింది. ఒక సాధారణ ఆటో డ్రైవర్ జీవితం .. కృష్ణుడి అనుగ్రహం కారణంగా ఎలా ప్రభావితమైందనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Go Back to Shorts
Lalo Krishna Sada Sahayate
Gujarati movie
Gujarati cinema
SonyLIV
OTT release
Low budget movie
हिट फिल्म
Box office collection
Ankit Sakhiya
Gujarati film industry

More Telugu News